కాటమరాయుడు ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో రహస్యం..?
on Mar 17, 2017

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం కాటమరాయుడుకు రిలీజ్ టైం దగ్గరపడింది. ఈ మూవీకి ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని ముందు అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల పాటల విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసి దాని స్థానంలో ప్రి-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్మాతలు డిసైడయ్యారు. దీనిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌లో కాటమరాయుడు ప్రి-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.
అదేంటంటే పవర్‌స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన పవన్‌కళ్యాణ్ నటుడిగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ 20 ఏళ్లలో ఆయన సాధించిన విజయాలను హైలెట్ చేస్తూ ఫంక్షన్ చేస్తామని ప్రొడ్యూసర్స్ పవన్‌తో అన్నారట.. కాని దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారట. అవేవి వద్దు మీకు అంతగా చేయాలి అనుకుంటే ఒక చిన్న క్లిప్పింగ్ రూపంలో దానిని తెలియజేస్తే చాలు అన్నారట. ఇలాంటి వ్యక్తిత్వమే పవన్‌ను మిగతా హీరోల నుంచి వేరు చేసింది. సో పవర్‌స్టార్ ట్వంటీ ఇయర్స్ జర్నీపై వీడియో ఎలా ఉందో చూడాలనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



