నితిన్ కపూర్ ఆత్మహత్య..మీడియాకి జయసుధ భయపడ్డారా..?
on Mar 17, 2017

దేశాన్ని ఏలే అధినేతలైనా..భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలైనా..ప్రపంచాన్ని కొనగలిగే అపర కుబేరులైనా భయపడేది మీడియాకు మాత్రమే. వారిని ఆకాశంలోకి ఎత్తాలన్నా..పాతాళానికి తొక్కాలన్నా మీడియాకు మాత్రమే సాధ్యం. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు ఉన్నవి లేనివి కూడా క్రియేట్ చేసి కథనాలు వండి వర్చుతుండటంతో ఆ వార్తల్లోని వ్యక్తులకు కంటిపై కునుకు లేకుండా పోతోంది. దీంతో ఏది నిజమో..ఏది రూమరో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రముఖ సినీనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
మామూలు వ్యక్తులు చనిపోతేనే దానిని సంచలన వార్తగా మార్చేసి మీడియా..ఒక సెలబ్రిటీ ఆత్మహత్య చేసుకుంటే వూరకే వదిలేస్తుందా..? కాని ఎందుకో మీడియా మిత్రులు ఈ వార్తను అంతగా పట్టించుకోలేదు. తెలుగు మీడియానే కాదు హిందీ మీడియా కూడా నితిన్ కపూర్ ఆత్మహత్యపై అంతగా ఫోకస్ చేయలేదు. అయితే మీడియా ఈ విషయంలో ఎలాంటి కథనాలు రాస్తుందోనని భయపడ్డ జయసుధ..అలాంటివేవి జరగబోయే సరికి ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు తన భర్త ఆత్మహత్యను సంచలనం చేయకుండా సంయమనం పాటించినందుకు మీడియాకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



