తారక్.. మరోసారి మార్చి టార్గెట్!?
on Apr 7, 2022
రీసెంట్ గా రిలీజైన `ఆర్ ఆర్ ఆర్`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ సినిమాతో పాన్ - ఇండియా స్టార్ అనిపించుకున్నాడు కూడా.
ఇదిలా ఉంటే, `ఆర్ ఆర్ ఆర్` తరువాత మరో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు తారక్. `జనతా గ్యారేజ్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో చేయనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. తొలుత అనుకున్నట్లుగా 2023 సంక్రాంతికి కాకుండా 2023 సమ్మర్ స్పెషల్ గా మార్చి నెలలో `ఎన్టీఆర్ 30`ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అదే గనుక నిజమైతే.. `ఆది` (2002), `ఆర్ ఆర్ ఆర్` (2022) తరువాత మార్చి నెలని టార్గెట్ చేసుకుని తారక్ నుంచి వస్తున్న సినిమా ఇదే అవుతుంది. మరి.. `ఆది`, `ఆర్ ఆర్ ఆర్`లాగే `ఎన్టీఆర్ 30` కూడా మార్చి సెన్సేషన్ గా నిలుస్తుందేమో చూడాలి.