షారూక్ తో మురుగదాస్!?
on Apr 7, 2022
స్టార్ హీరోలతోనే సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ ఒకరు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఏ భాషలో మెగాఫోన్ పట్టినా, సింహభాగం అగ్ర కథానాయకులతోనే జర్నీ చేస్తూ వచ్చారాయన. తెలుగునాట చిరంజీవి, మహేశ్ బాబు వంటి టాప్ స్టార్స్ ని డైరెక్ట్ చేసిన మురుగదాస్.. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు. ఇక హిందీలోనూ అంతే. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర కథానాయకులతో జట్టుకట్టాడు.
ఇదిలా ఉంటే, స్వల్ప విరామం అనంతరం మురుగదాస్ ఓ హిందీ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో భాగంగా.. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ని సంప్రదించి ఓ స్టోరీ లైన్ చెప్పాడట. అది నచ్చడంతో.. షారూక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మరి.. ఆమిర్, అక్షయ్ తో విజయాలు అందుకున్న మురుగదాస్.. షారూక్ తోనూ అదే బాట పడతాడేమో చూడాలి.
కాగా, షారూక్ ప్రస్తుతం `పఠాన్`, అట్లీ డైరెక్టోరియల్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 2023లో తెరపైకి రాబోతున్నాయి.