షాకింగ్.. ఇలియానాకి ఎంగేజ్ మెంట్ అయిందా?
on Oct 5, 2015
టాలీవుడ్ లో తన నడువొంపులతో అందరిని ఆకట్టుకొని చాలా తక్కువ టైంలోనే టాప్ ప్లేస్ సంపాదించుకున్న భామ గోవా బ్యూటీ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్ లో తన సత్తా చాటి.. అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరమైంది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తరువాత టాలీవుడ్ నుండి బిచాన ఎత్తి బాలీవుడ్ లో పాగా వేసింది. అయితే ఆసినిమా తరువాత వచ్చిన ఫటా పోస్ట్రర్ నిక్లా.. హ్యాపీ ఎండింగ్ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. దీంతో అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ లోనూ సినిమా అవకాశాలు లేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఇలియానా సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని హాట్ టాపిక్ నడుస్తోంది. అతనెవరో కాదు గత కొద్ది రోజులుగా షికార్లు కొడుతున్న ఆస్ట్రేలియా ప్రేమికుడు ఆండ్రూతో. ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ వీరిద్దరూ ఎప్పటినుండో ప్రేమాయణం సాగిస్తున్నారని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అతనితో ఇలియానికి ఎంగేజ్ మెంట్ అయిందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇంతకీ ఇలియానాకి ఎంగేజ్ మెంట్ అయిందో లేదో తెలియదు కాని.. ఒకవేళ ఇలియానాకి మాత్రం ఎంగేజ్ మెంట్ అయితే అభిమానులకు కొంచెం చేదు వార్తనే.