కొరటాల నెక్ట్స్ సినిమా ఎవరితోనో తెలుసా??
on Nov 12, 2016
.jpg)
టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు కొరటాల శివ. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. వరుసగా మూడు హిట్లు కొట్టి.... హ్యాట్రిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబరు నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. 2017 ఆగస్టులో మరో సినిమా పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోని దృష్టిలో ఉంచుకొని ఓ కథ కూడా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. పవన్‌కల్యాణ్. పవన్‌తో పనిచేయాలన్న కాంక్ష.. కొరటాలకు చాలా పెద్ద స్థాయిలో ఉందట. పవన్ కోసం కొరటాల ఓ కథ రెడీ చేసుకొన్నట్టు సమాచారం. మహేష్ తో సినిమా పూర్తయిన వెంటనే, పవన్‌తో సినిమా చేయడానికి ప్లాన్స్ వేస్తున్నాడట. త్వరలోనే పవన్ అపాయింట్ మెంట్ తీసుకొని, కలసి కథ వినిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నట్టు సమాచారం. కొరటాల దగ్గర పది కథలు రెడీగా ఉన్నాయని.. ఒకొక్క హీరోతో ఒక్కో కథ చేయబోతున్నాడని, ఆ లెక్కన టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరినీ కవర్ చేసేయడం ఖాయమని సమాచారం. సో.. 2017లో పవన్ - కొరటాల కాంబినేషన్ చూడొచ్చన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



