చరణ్ పరువు... గోవిందా!
on Nov 12, 2016

ఓవర్సీస్‌లో మార్కెట్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి హీరోలంతా కసరత్తులు చేస్తున్నారు. అందులో చాలామంది విజయం సాధించారు కూడా. నాని లాంటి కథానాయకుల సినిమాలకు అక్కడ కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చరణ్‌కి అక్కడ హిట్స్ లేవు. మగధీర మినహాయిస్తే ఏ సినిమా అక్కడ కాసుల వర్షం కురిపించుకోలేకపోయింది. తాజాగా ధృవకీ అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయేమో అనిపిస్తోంది. ధృవ సినిమాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బిజినెస్ బాగానే జరుగుతున్నా ఓవర్సీస్‌లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఈ సినిమాని ముందు క్లాసిక్ సినిమా సంస్థ కొనడానికి ముందుకొచ్చింది. అయితే.. రూ.6 కోట్లు డిమాండ్ చేసిందట చిత్రబృందం. దాంతో క్లాసిక్‌సినిమా వెనకడుగు వేసింది. ఇప్పుడు జాలీ హిట్స్ సంస్థ కి బతి మాలి మరీ అప్పగించినట్టు టాక్. ఈ సంస్థకు కేవలం రూ.3 కోట్లకే కట్టబెట్టారట. నాని, శర్వానంద్ లాంటి హీరోల సినిమాల్ని అక్కడ ఈజీగా రెండున్నర కోట్లకు కొనేస్తున్నారు. అలాంటి చోట రామ్ చరణ్ సినిమాని అమ్మడానికి ఇన్ని పాట్లు పడుతున్నారంటే.. చరణ్ స్టార్ డమ్‌కి ఓవర్సీస్ వాళ్లు ఇచ్చే విలువేంటో అర్థమవుతోంది. అయితే ఈసినిమా ఓవర్సీస్‌లో కూడా బాగా ఆడాలని, ఆడుతుందని చరణ్ భావిస్తున్నాడు. అందుకే అక్కడ రికార్డు స్థాయిలో 114 స్క్రీన్లలో ఈ సినిమానిప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు చరణ్. కనీసం ధృవ అయినా... చరణ్ పరువుని నిలబెడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



