మెగా ఫ్రస్టేషన్ కి ముగింపు ఎప్పుడో?
on Oct 29, 2015
రామ్ చరణ్ 'బ్రూస్ లీ' లో మెగా ఎంట్రీకి అదిరిపోయే రెంజులో ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ 150వ సినిమాపై అంచనాలు భారీ రెంజులో పేరిగిపోయాయి. చిరంజీవి సినిమాపై వారం రోజుల్లో ప్రకటన రాబోతుందని రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అందరికీ ఆశ పెట్టి వదిలేసాడు. ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా లేదు. దాంతో ఈ సినిమా ఉన్నట్టా? లేనట్టా? అనే డైలామాలో పడిపోయాడు మెగా ఫ్యాన్స్. అసలు చిరు సినిమా ప్రకటన ఎందుకు రాలేదు.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం.. రామ్ చరణ్ 'బ్రూస్ లీ' ఫ్లాప్ టాక్ రావడంతో చిరంజీవి తిరిగి పునరాలోచనలో పడ్డాడట. ఈ టైమ్ తన 150వ సినిమా కంటే ..చరణ్ కి ఓ హిట్ ఇవ్వడం ముఖ్యమని ఆలోచిస్తున్నాడట. అందుకే చరణ్ ని స్క్రిప్ట్ లపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించాడట. అలాగే తన సినిమాని వాయిదా వేసుకొని చరణ్ కోసం మంచి కథలను పట్టే పనిలో చిరు ఇప్పుడు పూర్తిగా నిమగ్నమయ్యాడ ట. అయితే మెగా కాంపౌండ్ వర్గాలు మాత్రం విషయాన్ని అంగీకరించడం లేదు.
చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని సంక్రాంతికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది అంటున్నారు. మొత్తానికి చిరంజీవి 150వ సినిమా..ఎప్పుడో తెలియక మెగా ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ తో సతమతమవుతున్నారు.