బ్రూస్ లీ ఆడియో: కత్తి రిమేక్ పై ప్రకటన వస్తుందా?
on Oct 2, 2015
.jpg)
హైదరాబాద్ శిల్పకళావేదికలో బ్రూస్ లీ హంగామా మొదలైంది. ఈ ఆడియో వేదికపై చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని మెగాస్టార్ వివరించబోతున్నారు. అలాగే చిరు నోట ఆ 150వ సినిమా డీటెయిల్స్ వినాలన్న కుతూహాలం అభిమానుల లో ఉంది. అందుకే ఈ ఆడియో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తన 150వ చిత్రం గురించి ఈ రోజు ప్రకటన చేస్తాడా? లేదా? అనే ఆసక్తి కరంగా మారింది. అలాగే చిరు కత్తి రిమేక్ చేస్తున్నాడని..గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజమో? కాదో నేటితో తేలిపోనుంది. ఇవ్వన్ని బ్రూస్ లీ ఆడియోకి బోలెడంత హైప్ తెచ్చేశాయి. మరి కాసేపట్లో మొదలుకానున్న బ్రూస్ లీ ఆడియోలో ఎలాంటి ప్రకటనలు రానున్నాయో తెలియాలంటే వేచి వుండాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



