బాలయ్య సినిమాలో అరవింద్ స్వామి!
on Sep 5, 2022
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తదుపరి సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
'రోజా', 'బొంబాయి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన అరవింద్ స్వామి రీఎంట్రీ తర్వాత తెలుగులో 'ధృవ'(2016) సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'NBK 108'లో ఒక కీలక పాత్ర కోసం అనిల్ రావిపూడి ఆయనను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించనుందని గతంలో అనిల్ చెప్పాడు.