అనుష్క ఆ ఫ్యామిలీకి దూరమా?
on Jun 1, 2015
అనుష్కకు మెగా ఫ్యామిలీ అంటే పడదా? లేదా మెగా ఫ్యామిలీ ఈ అరెబియన్ గుర్రాన్ని పట్టించుకోవడం లేదా? టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఎందుకంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో అనుష్క ఫస్ట్ ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లైనా ఏ మాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. కానీ ఇప్పటి వరకూ మెగా హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అమ్మడు కనిపించలేదు. గతంలో చిరంజీవి స్టాలిన్ లో ఓ సాంగ్ లో చిందేసింది. వేదంలో అల్లు అర్జున్ కి-ఆమెకి సంబంధమే ఉండదు. ఇప్పడు మళ్లీ రుద్రమదేవిలో బన్నీ ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడంతే. ఇవన్నీ ఒకెత్తైతే....పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్లో అమ్మడిని తీసుకుంటారనే వార్తలొచ్చాయి. లేటెస్ట్ గా అవీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. పోనీ ఇవన్నీ వదిలేయండి...కనీసం చిరు 150 సినిమాలో అమ్మడికి ఛాన్స్ ఇస్తే బావుంటుందేమో అనే కొత్త డిస్కషన్ ఊపందుకుంది. ఎందుకంటే ముదురు హీరో పక్కన చూడచక్కగా ఉండడంతో పాటూ....ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే ఓసారి మెగాస్టార్ థింక్ చేస్తే మంచిదంటున్నారు. అమ్మడు ఫేడవుట్ అయ్యేలోగా....మెగా హీరోలతో రొమాన్స్ చేస్తుందో లేదో?