అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Aug 7, 2025

ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా పలు భారీ మల్టీస్టారర్ లు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'వార్-2' ఈ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రామాయణ'లో రణబీర్ కపూర్, యశ్ కలిసి నటిస్తున్నారు. త్వరలో అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశముందని తెలుస్తోంది.
'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన హోంబలే ఫిలిమ్స్.. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను రంగంలోకి దింపాలని చూస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్ ముగ్గురూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అట్లీతో బన్నీ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. షారుఖ్ చేతిలో 'కింగ్' మూవీ ఉంది. నీల్ కూడా ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ల తర్వాత.. వీరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ కు హోంబలే ఫిలిమ్స్ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.
ఈ మల్టీస్టారర్ సాధ్యమైతే మాత్రం.. కేవలం ప్రకటనతోనే సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక విడుదల తర్వాత ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



