Home

»

Gossips

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'హరి హర వీరమల్లు'లో అకీరా నందన్!

Oct 26, 2021 4:31PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ లుక్ ఆకట్టుకుంది. అయితే ఇందులో పవన్ ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ ఉందని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ తనయుడు అకీరా నందన్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే రోజు తొందర్లోనే రానుందని అంటున్నారు. 'హరి హర వీరమల్లు' సినిమాలో అకీరా నందన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కీలక పాత్రకు అకీరా అయితే బాగుంటుందని క్రిష్ సూచించగా.. పవన్ ఓకే అన్నారని తెలుస్తోంది. అకీరా సైతం తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌ పై ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధీ అగర్వాల్, జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com