'యశోద'లో ఉన్ని ముకుందన్.. అప్పుడు అనుష్క, ఇప్పుడు సమంత!
on Dec 11, 2021

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతకాంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శక ద్వయం హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
Also Read: బాలీవుడ్ లో సమంత హవా మొదలైంది.. 'రాజీ'కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్!
ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న 'యశోద'లో సమంతకు జోడీగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాతో ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత అనుష్క శెట్టితో కలిసి 'భాగమతి'లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం రవితేజ 'ఖిలాడీ' మూవీలోనూ నటిస్తున్నాడు. ఉన్ని ముకుందన్ తమిళ ప్రేక్షకులను కూడా సుపరిచితుడే. 2011 లో వచ్చిన ధనుష్ సీడన్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఈ మలయాళ నటుడు. మలయాళంలో మంచి గుర్తింపు ఉండటంతో పాటు.. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచుతుడు కావడంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'యశోద' మూవీ కోసం చిత్ర యూనిట్ ఉన్ని ముకుందన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Also Read: 'ఊ అంటావా మావ'.. సమంత తగ్గేదేలే!
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న మరో మూవీ 'శాకుంతలం'లో కూడా మలయాళ నటుడు నటిస్తుండటం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. వరుస ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత.. రెండు సినిమాలలోనూ మలయాళ యాక్టర్ తో కలిసి నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
Also Read: 'యశోద'గా మారిన సమంత!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



