'యశోద'గా మారిన సమంత!
on Dec 6, 2021
సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఆమె మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఆ సినిమాకు 'యశోద' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
త్వరలో 'శాకుంతలం'తో ప్రేక్షకులను పలకరించనున్న సమంత 'యశోద' అనే మరో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి సిద్ధమైంది. శ్రీదేవి మూవీస్ పతకాంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శక ద్వయం హరి-హరీష్ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేడు(సోమవారం) ప్రారంభమైంది. మార్చి కల్లా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ యశోదతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
సమంత 'ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంగ్లీష్ మూవీలోనూ నటిస్తోంది. దీనితో పాటు సౌత్, బాలీవుడ్ లలో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సమంత.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ కూడా చేస్తోంది.
Also Read