ఆ ఎఫైర్ బలపడుతోంది..!!
on Oct 1, 2015
హృతిక్ తో సుసాన్ డైవర్స్ కు కారణం అర్జున్ రాంపాల్ తో ఎఫైర్ ఉండటమే అన్న ఓ రూమర్ ఉంది బాలీవుడ్లో. ఆ విషయాన్ని సుసాన్ చాలాసార్లు ఖండించింది. కానీ హృతిక్ నుంచి విడిపోయాక సుసాన్ తరచుగా రాంపాల్ తో కలిసి కనిపిస్తుండటం పాత డౌట్లు నిజమే అని రుజువు చేస్తోంది. ఈ మధ్య ముంబయిలోని ఓ పెద్ద కాఫీ షాప్ లో ఇద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ మీడియా కంట పడటంతో రచ్చ రచ్చ అయింది. డైవర్స్ అయిన మొదట్లో కొంచెం చాటు మాటుగా ఉన్న వీళ్ల వ్యవహారం ఈ మధ్య మరీ పబ్లిక్ అయిపోవడంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఐతే దీనిపై సుసాన్ ఆగ్రహంతో ఊగిపోయింది. నేను పెళ్లి చేసుకోబోతున్నానని మీకెవరు చెప్పారంటూ అగ్గిమీద గుగ్గిలం అయింది. ఐతే పెళ్లి సంగతి అబద్ధం కావచ్చేమో కానీ.. రాంపాల్ తో ఆమె ఎఫైర్ మాత్రం నిజం అన్నది అందరికీ తెలిసిపోయింది.