సుధీర్ కి అంతసీనుందా?
on Jun 1, 2015
ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికెగిరిందట. మహేశ్ బాబు బావ సుధీర్ బాబు తీరు చూస్తుంటే ఇలానే ఉంది. టాలీవుడ్ లో ఇఫ్పటివరకూ సరైన సక్సెస్ లేని సుధీర్ బాబు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడట. ఎస్ ఎమ్ ఎస్ తో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ప్రేమకథాచిత్రంలో తొలిహిట్ అందుకున్నాడు. రీసెంట్ గా మోసగాళ్లకు మోసగాడుగా వచ్చి బోల్తాపడ్డాడు. త్వరలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ రానున్నాడు. అయితే బామ్మర్ది మహేశ్ ఎంత ప్రమోట్ చేసినా సుధీర్ కెరీర్ గాడిన పడడం లేదు. దీంతో టాలీవుడ్ పై విసుగొచ్చిన సుధీర్ బాలీవుడ్ వైపు చూస్తున్నాడట. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. అయితే ఇప్పటికే రానా, రామ్ చరణ్ బీటౌన్ కి వెళ్లి భంగపడి వచ్చారు. రానా అంతో ఇంతో పర్వాలేదు కానీ.... రామ్ చరణ్ పరిస్థితి మరీ దారుణం. అంతెందుకు టాలీవుడ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న మహేశ్ సైతం బాలీవుడ్ వైపు చూసేందుకు భయపడుతున్నాడు. అలాంటిది సుధీర్ ఇప్పడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నడా అని డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో మేటర్ హీరో ఎక్కడికెళితే ఏంటని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
