3 నెలల ముందే టికెట్ బుకింగ్?
on Dec 2, 2014
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా వార్తే. వరుస హిట్లతో దూకుడుమీదున్న సల్లూ భాయ్ తన కొత్త సినిమా కోసం కొత్త పాన్ ను రూపొందిస్తున్నాడట. అదేంటో తెలుసా... సినిమా రిలీజ్ కు 3 నెలల ముందే ప్రేక్షకులకు టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని. ఇప్పటిదాకా ఏ సినీ ఇండస్ట్రీలోనూ ఈరకం ఆలోచన ఎవ్వరికీ రాలేదు.
సల్మాన్ తాజాగా ప్రేమ్ రతన్ ధన్ పాయో అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా. 2015 దివాళికి సినిమాను రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక సినిమా ప్రమోషన్ కూడా కొత్తగా ఉండబోతుందట. 2015 ఏప్రిల్ కల్లా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాలని సల్లూభాయ్ లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకులకు 3 నెలలకు ముందే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించేలా వర్క్ జరుగుతోందట.
3 నెలలకు ముందే నిజంగానే టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించడం మంచి ఆలోచనేనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచవచ్చు. సినిమాకు ఈజీగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఒకవేళ ఫలితం ఎలా ఉన్నా వారం, పదిరోజుల్లోనే మొత్తం కలెక్షన్లను రాబట్టుకోవచ్చు. ఒకవేళ సల్మాన్ తన సినిమాకు ఈ పద్ధతిని మొదలుపెడితే బాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.