'రుద్రమదేవి'కి అడ్డంకులు..!
on Dec 3, 2014
టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలపాలని దర్శక నిర్మాతలతోపాటు హీరోలు కూడా ఆసక్తి చూపించడం పరిపాటే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో పందెం కోళ్ళలా నిలుస్తాయి. అయితే ఈసారి స్టార్ హీరోలకు పోటీగా స్టార్ హీరోయిన్ సినిమా పోటీలో నిలబోతుంది. చాలా కాలం తరువాత సంక్రాంతికి వస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'. అయితే ఈ సినిమా రిలీజ్ కు ప్రస్తుతం అడ్డంకులు ఎదురౌతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాలు బరిలో వుండడంతో ఈ సినిమాకు థియేటర్లు దొరకడం లేదట. అలాగే ఈ సినిమాకి బిజినెస్ ఎంక్వైరీలు కూడా ఎక్కువగా జరగడం లేదట. దీంతో ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలా? వద్దా అనే ఆలోచనలో వున్నాడట గుణశేఖర్. ఇప్పటికే ఫైనాన్స్ కష్టాల్లో ఉన్న 'రుద్రమదేవిని' స్టార్ హీరోలకి పోటీగా కాకుండా ముందుగా రిలీజ్ చేస్తే మంచిదని ఇండస్ట్రీ పెద్దలు కూడా సలహాలు ఇస్తున్నారట. ప్రస్తుతం ఫైనాన్స్ కష్టాల్లో వున్న 'గుణ' రుద్రమ రిలీజ్ కోసం ఇంకాస్త టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.