రేణు దేశాయ్ పర్శనల్ లైఫ్ గురించి....
on Dec 3, 2014
నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. ఆమె సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చాలా ఏక్టివ్ గాఉంటారు. అయితే వాటిల్లో ఎక్కడా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉండదు. పుట్టినరోజున ప్రత్యేక ఇంటర్వ్వూ పేరుతో ప్రస్తుతం టాలీవుడ్ మీడియాకు మైండ్ హీటెక్కించే స్టేట్ మెంట్ విడుదల చేసింది. సినిమాకు విడుదలకు ముందు ప్రోమో వచ్చినట్లుగా.., ఇంటర్య్వూకు ముందుగా వ్యక్తిగత విషయాలు, ఎప్పుడూ చెప్పని అంశాలు చెప్తాను అంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. ‘నా పుట్టినరోజైన డిసెంబర్ 4న ప్రత్యేకమైన ఇంటర్య్వూ ఇస్తున్నాను. తొలిసారి నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడబోతున్నాను. గురువారం రోజు మీ అందర్నీ యూట్యూబ్ లో కలుస్తాను’ అని ట్విట్టర్ లో కామెంట్ చేసింది. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.