టాలీవుడ్ హీరోలపై హాట్ బ్యూటీ ఫైర్
on Jul 1, 2015
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది రాధిక ఆప్టే. ఆ తర్వాత బాలయ్య బాబు సరసన లెజెండ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈ బోల్డ్ బేబీ మళ్లీ బాలయ్యతోనే లయన్ లో అవకాశం అందుకుంది. ఆ తరువాత ఈ హాట్ బ్యూటీకి అవకాశాలే రాలేదు. ఈ విషయం గురించి ఈ అమ్మడిని అడిగితె మన తెలుగు హీరోలంటే గిట్టకనే ఇక్కడ సినిమాలు చేయడం లేదని వాపోయిందట.
తెలుగు ఇండస్ట్రీలో హీరోల పెత్తనమే ఎక్కువ. అక్కడ హీరోయిన్లను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తుంటారు. దర్శక నిర్మాతలు సైతం అదే విధంగా ఆలోచిస్తారు అంటూ దుమ్మెత్తి పోస్తోందట. అందుకే టాలీవుడ్‌లో పలు అవకాశాలు వస్తున్నాఒప్పుకోవడం లేదని స్పష్టం చేసిందట. దీంతో అమ్మడు చేతిలో ఆఫర్లు లేకనే ఇలా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని గుసగుసలాడుకుంటున్నారు సినీజనం. అయినా చేసింది రెండు సినిమాలైతే తెలుగు హీరోల గురించి అంత విషయ పరిజ్ఞానం ఎక్కడిదని కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
