అనుష్క ఐ లవ్ యూ!
on Jul 1, 2015
లింకులు పెట్టి రాస్తారెందుకబ్బా అని అంతా తలపట్టుకుంటుంటే....నాగశౌర్య రివర్స్ లో బిహేవ్ చేస్తున్నాడు. ఆ మధ్య రెజీనాతో ఏఫైర్ నడుస్తోందంటూ ప్రచారం జరిగిందంటున్న శౌర్య....అస్సలు రెజీనాతో తాను మాట్లాడేలేదన్నాడు. అక్కడితో ఆగితే సరే కానీ...రాశిఖన్నాతో లింకులు ఎందుకు పెట్టలేదని హింటు ఇస్తున్నాడు.
ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత ఇద్దరం చాలా క్లోజ్ అయ్యామని...ఒక్కరోజైనా కలవకుండా ఉండలేదని సెలవిచ్చాడట. మా ఇద్దరి గురించి ప్రచారం జరుగుతుందనుకుంటే మధ్యలో ఏమీ తెలియని రెజీనాను ఇరికించారని అసలు సంగతి చెప్పాడట. దీంతో అవాక్కవడం జనాల వంతైంది.
ఇంతకీ మేటరేంటి గురూ అంటే...రాశిఖన్నా కూడా కాదుకానీ....వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తున్నా...ఆమె ఒప్పుకుంటే పెళ్లిచేసుకుంటా అన్నాట్ట. మళ్లీ ఇదేంటి బాసూ అంటే....బొమ్మాళి అనుష్క అంటే నాకు భలే ఇష్టం. ఏడేళ్లుగా ఆమెనే ప్రేమిస్తున్నా అని ట్విస్ట్ ఇచ్చాడట. మొత్తానికి కుర్రాడికి కితకితలు ఎక్కువే.