బన్నీ ఎంట్రీతో నానికి ఊహించని షాక్!
on Nov 13, 2021
'ఆర్య', 'ఆర్య-2' సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది. అదే జరిగితే నేచురల్ స్టార్ నానికి బిగ్ షాక్ అనే చెప్పాలి.
పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు మొదట్లో మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత చెప్పిన టైం కంటే వారం ముందే రానుంది అంటూ రిలీజ్ డేట్ ని డిసెంబర్ 17కి ప్రీపోన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమవుతున్న కారణంగా పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ ని వారం రోజులు వాయిదా వేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 లేదా 25 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
పుష్ప విడుదల వారం వాయిదా పడితే నాని కి పెద్ద షాక్ అన్నట్లే. ఎందుకంటే నాని అప్ కమింగ్ మూవీ 'శ్యామ్‌సింగ రాయ్'ను డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన గత చిత్రాలు V, టక్ జగదీష్ నిరాశపరచడంతో ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. క్రిస్మస్ కి సోలోగా వచ్చి సాలిడ్ హిట్ అందుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు రేస్ లోకి పుష్పతో బన్నీ ఎంట్రీ ఇస్తే నాని సినిమాపై గట్టి ప్రభావం పడే అవకాశముంది. మరి పుష్ప నిజంగానే పోస్ట్ పోన్ అయ్యి నానికి షాక్ ఇస్తుందో లేక డిసెంబర్ 17కే వచ్చి నాని కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తుందో చూడాలి.