రాజా సాబ్ ఎఫెక్ట్.. మారుతికి మొట్టికాయలు.. పీపుల్ మీడియాకి మరో ఛాన్స్!
on Jan 22, 2026

నిరాశపరిచిన రాజా సాబ్
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాస్టర్ ప్లాన్
స్పిరిట్ రైట్స్ తో పాటు, ప్రభాస్ తో మరో మూవీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'ది రాజా సాబ్' (The Raja Saab) మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. సోషల్ మీడియా వేదికగా మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరో పిలిచి ఇంత పెద్ద అవకాశమిచ్చి, ఇంత టైం ఇస్తే.. ఇదా చేసేది అంటూ ఫైర్ అవుతున్నారు. మారుతి పరిస్థితి ఇలా ఉంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిస్థితి మరోలా ఉంది.
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'ను పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల రూ.50 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో 'ది రాజా సాబ్'ని నిర్మించగా రూ.100 కోట్లకు పైగా నష్టం చూడాల్సి వచ్చిందట. మొత్తానికి ఈ రెండు సినిమాల వల్ల పీపుల్ మీడియాకు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
"ముల్లును ముల్లుతోనే తీయాలి" అన్నట్టుగా ఈ నష్టాలను ప్రభాస్ సినిమాలతోనే కవర్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చూస్తుందట. ఈ క్రమంలోనే 'స్పిరిట్' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే 'స్పిరిట్'తో చాలా వరకు నష్టాలు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: బాలయ్య సాలిడ్ లైనప్.. లిస్టులో ఐదుగురు స్టార్ డైరెక్టర్స్!
అయితే 'స్పిరిట్' రైట్స్ తో పాటు, పీపుల్ మీడియా మరో ఎత్తుగడ కూడా వేసిందట. తక్కువ టైం, తక్కువ బడ్జెట్ లో కంటెంట్ బేస్డ్ సినిమా తీద్దామనే ప్రపోజల్ ని ప్రభాస్ ముందు ఉంచిందట. నో చెప్పడం పెద్దగా అలవాటు లేని ప్రభాస్.. పీపుల్ మీడియా బ్యానర్ లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ప్రభాస్ మరో సినిమా చేయనున్నాడనే న్యూస్ పై కూడా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రమోషన్స్, ఫైనల్ కాపీ రెడీ చేసుకోవడం వంటి విషయాల్లో పీపుల్ మీడియా తడబాటు కనిపించిందని.. అందుకే ఆ బ్యానర్ లో మరో సినిమా చేయడం కరెక్ట్ కాదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



