రెమ్యూనరేషన్ పెంచేసిన నవీన్ పొలిశెట్టి.. ఎన్ని కోట్లంటే..?
on Jan 20, 2026

వరుసగా నాలుగు విజయాలు
వంద కోట్ల క్లబ్ లో 'అనగనగా ఒక రాజు'
నవీన్ పొలిశెట్టి రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడా?
"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అన్నట్టుగా.. విజయాల్లో ఉన్నప్పుడు పారితోషికం పెంచాలనేది సినీ తారలు పాటించే సూత్రం. ఒక విజయం వస్తేనే అమాంతం రెమ్యూనరేషన్ పెంచే రోజులివి. అలాంటిది వరుసగా నాలుగు విజయాలు అందుకున్న హీరో తన రెమ్యూనరేషన్ పెంచేయడంలో వింత లేదు. తాజాగా నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) కూడా అదే చేసినట్లు తెలుస్తోంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలతో హీరోగా మూడు విజయాలు అందుకున్న నవీన్ పొలిశెట్టి.. తాజాగా 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju)తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా వరుసగా నాలుగు విజయాలను అందుకోవడంతో.. నవీన్ పొలిశెట్టి తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ సినిమాకి రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నవీన్ ఉన్న ఫామ్ దృష్ట్యా ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనకాడట్లేదట.
పైగా నవీన్ పొలిశెట్టి నటనకే పరిమితం కాకుండా.. రైటింగ్ లోనూ ఇన్వాల్వ్ అవుతాడు. 'అనగనగా ఒక రాజు' స్క్రిప్ట్ ని తన టీమ్ తో కలిసి నవీన్ రాయడం విశేషం. రైటింగ్ మాత్రమే కాదు.. ఫస్ట్ కాపీ రెడీ అయ్యేవరకు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి వారధిలా ఉంటూ అన్నీ తానై చూసుకుంటాడు. అందుకే నవీన్ తో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారట.
తన విజయపరంపరను ఇలాగే కొనసాగిస్తూ.. నవీన్ పొలిశెట్టి మరో రెండు మూడు విజయాలు అందుకుంటే.. తన రెమ్యూనరేషన్, మార్కెట్ రెండూ మరింత పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.
Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ
కాగా, 'అనగనగా ఒక రాజు' సినిమా విషయానికొస్తే నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, అదిరిపోయే వసూళ్లతో రన్ అవుతోంది. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



