పొడుగు చెప్పులు కొనుక్కుంటున్న నిత్యా
on May 18, 2015
నిత్యామీనన్ అతి పెద్ద హీల్స్ ఉన్న చెప్పులు కొనుక్కోవాలనుకుంటోందట. ప్రస్తుతం ఇండస్ట్రీలో అతిపొట్టి హీరోయిన్ నిత్యానే. దీంతో కెమెరా ఎన్ని యాంగిల్స్ తిప్పినా అమ్మడిని హీరోతో సమానంగా చూపించడం కష్టమే. అసలే పొట్టిపిల్ల అని అంతా ఏడిపిస్తుంటే.....తాజాగా విశాల్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట. ఆరడుగులుండే విశాశ్ పక్కన నాలుగడుగుల నిత్యామీననా? అని తెగ నవ్వేసుకుంటున్నారంతా. ఆ మధ్య ఓ ఆడియో వేడుకలో విశాల్ పక్కన నిల్చుని ఫొటో దిగిన నిత్యను చూసి తాటిచెట్టు పక్కన అరటి చెట్టులా ఉందే కామెంట్స్ చేశారు. అసలు వీరిద్దరి కాంబినేషన్ సట్టవదని బహిరంగంగానే అంటున్నారు. అయితే ఎలాంటి మైనస్ లను అయినా నిత్యా తన నటనతో కవర్ చేసేస్తుందంటున్నారు సదరు దర్శకనిర్మాతలు. మరి ఈ జంటే ఫైనలవుతుందా? విశాల్ పర్కన మోస్తరుగా అయినా కనిపించాలంటే ఎంత హీల్ వేసుకుంటుందో? వెయిట్ అండ్ సీ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
