మరోసారి సూపర్ స్టార్ తో
on May 18, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఎంట్రీ ఇచ్చిన నయనతార ఈ స్థాయికి చేరుతుందని కల్లో కూడా ఊహించలేదు. సినిమాల కన్నా వివాదాలతోనే అమ్మడు పాపులారిటీ సంపాదించుకుంది. శింభులో ప్రేమ...ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి పెటాకులయ్యాక మళ్లీ కెరీర్ పై ఫుల్ కాన్సన్ ట్రేషన్ చేసింది. వరుసగా కుర్రహీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. ఈ టైమ్ లో మరో బంపర్ ఆఫర్ అమ్మడిని పలకరించిందని టాక్. అదికూడా తనకు మంచి కెరీర్ ఇచ్చిన రజనీకాంత్ సరసన కావడంతో ఆకాశంలో విహరిస్తోందట. తమిళంలో రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం నయన్ పేరును పరిశీలిస్తున్నారట. చంద్రముఖి తర్వాత రజనీకాంత్ శివాజీ, కథానాయకుడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ మాత్రమే చేసిన నయన్...మళ్లీ ఆయన సరసన హీరోయిన్ అనేసరిగి ఎగరి గంతేస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఏదేమైనా కోలీవుడ్ లో నయన్ హవా నడుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
