నాగ్ అనుష్క ఫ్లాప్ కాంబినేషన్?
on May 14, 2015
.jpg)
అనుష్క లేటెస్ట్ మూవీ సైజ్ జీరోలో నాగార్జున అతిధిపాత్ర పోషిస్తాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. అయితే ఆసినిమా ఫ్లాప్ అని పిక్సైపోయారంతా. అనుష్క మూవీ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా నాగ్-అను మధ్య కెమిస్ట్రీ అదిరిపోద్ది కదా. మరెందుకు ఈ ప్రచారం జరుగుతోందంటారా? ఈ జంట చూడచక్కగా ఉంటుందనే మాట నిజమే కానీ వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్టవలేదు. అనుష్క ఎంట్రీ మూవీ సూపర్....అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన డాన్ ని చూడాలంటే భయపడ్డారు. రగడ, ఢమరుకం కూడా .చివరికి అనుష్క స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిన కేడీ కూడా బోల్తాపడింది. దీంతో జంటబాగుంటే చాలదు కాంబినేషన్ కూడా కలసిరావాలి అంటున్నారు. ఈ లెక్కన అనుష్క సైజ్ జీరోలో నాగ్ స్పెషల్ అపియరెన్స్ అంటున్నారు కానీ సెంటిమెంట్ ప్రకారం నెగిటివ్ రిజల్ట్ వస్తుందేమో అనే భయం లేకపోలేదు. మరి నాగ్-అనుష్క గత సెంటిమెంట్ ను తిరగరాస్తారేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



