మరో భారతీయుడా?
on May 14, 2015
.jpg)
కమల్ హాసన్ ఆలోచనలు అంతుచిక్కవు.ఎప్పుడు ఎవరికి పట్టం కడతాడో అర్థంకాదు. ప్రస్తుతం మనీషాకొయిరాలాతో రొమాన్స్ చేయబోతున్నా అని చెప్పి సంచలనం సృష్టించాడు. కొన్నాళ్ల క్రితం మనీషా క్యాన్సర్ బారిన పడడం...దాన్ని జయించి తిరిగి రావడం జరిగిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్స్ చేస్తా అని తనకు తెలిసిన వారందరకీ ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించలేదట. ఇంతలో కమల్ నుంచి కాల్ రావడంతో అమ్మడి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ' ఒరే ఇరవు' అనే యాక్షన్ ఎంటర్ టైనర్లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట కమల్. ఒక్కరాత్రిలో కమల్ లైఫ్ లో జరిగిన సంఘనలపై కథాంశం సాగనుంది. ఇఫ్పటికే త్రిష ఓ హీరోయిన్ గా ఎంపికైంది. లేటెస్ట్ గా మనీషాను కూడా ఇందులో తీసుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి కలమ్ ఉదార స్వభావానికి, స్నేహానికి ఇచ్చే విలువపై కోలీవుడ్ జనాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే భారతీయుడు కాంబినేషన్ మళ్లీ అదే స్థాయిలో మ్యాజిక్ చేస్తుందేమో చూద్దాం!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



