హను రాఘవపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్!
on Sep 14, 2022

'అందాల రాక్షసి'(2012) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన హను రాఘవపూడి ఇటీవల విడుదలైన 'సీతా రామం' సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 'సీతా రామం' బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయన తదుపరి సినిమా ఏంటనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. అయితే ఆయన ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యువ హీరోలు నాని, శర్వానంద్ తో హను రాఘవపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో నానితో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', శర్వాతో 'పడి పడి లేచే మనసు' చేయగా.. అందులో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను కలిపి హను ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు మొదలయ్యాయని, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని సమాచారం.
శర్వా రీసెంట్ గా 'ఒకే ఒక జీవితం'తో ప్రేక్షకులను పలకరించాడు. ఇక నాని ప్రస్తుతం 'దసరా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ గతంలో వేరే హీరోలతో మల్టీస్టారర్స్ చేశారు కానీ ఈ ఇద్దరు కలిసి చేయలేదు. మరి హను రాఘవపూడి ఈ ఇద్దరు హీరోలను కలుపుతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



