స్టార్ డైరెక్టర్ తో ఈషా రెబ్బా పెళ్లి!
on Sep 8, 2022

'అంతకు ముందు ఆ తరువాత'(2013) చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈషా రెబ్బా కేవలం లీడ్ రోల్స్ లోనే కాకుండా స్పెషల్ రోల్స్ లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్, మలయాళంలోనూ నటిస్తున్న ఈ తెలుగు బ్యూటీ దాదాపు సౌత్ అంతా కవర్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కోలీవుడ్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్న ఈషా.. అక్కడ ఒక స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. వారి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారని, త్వరలోనే ఈషా పెళ్లి ప్రకటన రానుందని న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



