అమలా పాల్ అప్పుడేనా ?!
on Jul 25, 2016
కెరీర్ ప్రారంభంలో కాస్త అసభ్యకరమైన చిత్రాల్లో నటించినప్పటికీ.. కొంచెం పేరు వచ్చాక మాత్రం అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న అమలాపాల్.. రెండేళ్ల క్రితమే ఎ.ఎల్.విజయ్ అనే దర్శకుడిని ప్రేమించి మరీ పెళ్లాడింది. పెళ్ళైన కొత్తలో మొగుడ్ని వెంటేసుకొని హనీమూన్ కి దేశవిదేశాలు తిరిగిన అమలాపాల్.. ఆఖరికి వారు శోభనం జరుపుకోబోయే బెడ్ ఫోటోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పట్లో హల్ చల్ చేసిందిలెండి.
కట్ చేస్తే.. ఇంకా మూడేళ్లు కూడా పూర్తవ్వకుండానే తన భర్తతో వచ్చిన విబేధాల కారణంగా అతడ్నుంచి విడాకులు తీసుకోవడానికి సన్నద్ధమవుతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మొన్నటివరకూ బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ "బ్రేకప్/విడాకుల" పరంపర ఇప్పుడు సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీకి కూడా తగిలిందిలా ఉంది. మరి ఈ విడాకుల వార్తలు కేవలం కల్పితమో లేక నిజంగానే వారు విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారా? అనేది తెలియాలంటే అమలాపాల్ నోరు విప్పాల్సిందే!