నాగార్జున 'రెండు నాల్కల' తీరుపై సోషల్ మీడియాలో 'రగడ'!
on Jan 7, 2022

ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతూ దొరికిపోతున్నారు సెలబ్రిటీలు. తాజాగా ఆ లిస్టులో సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలపై లేటెస్ట్‌గా ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనను ట్రోల్ చేయడానికి కారణమయ్యాయి. గతంలో ఇదే అంశంపై ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన పాత వీడియో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్‌చేస్తూ, ఆయన రెండు నాల్కల ధోరణిపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అలాగే మీమ్స్‌తోనూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల 'బంగార్రాజు' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో ఏపీలో సినిమా టికెట్ ధరలపై స్పందించమని అడిగిన ఒక జర్నలిస్టుకు తాను సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడనని ఆన్సర్ ఇచ్చారు నాగ్. అలాగే ఏపీలో సినిమా టికెట్ ధరలతో తనకూ, తన సినిమాకూ ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు తన సినిమాకు సరిపోతాయని అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు చూసి, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యానికి గురైంది.
Also read: పెళ్లి తర్వాత నటనకు దూరమైన జయమాలిని.. భర్త ఆమెపై ఆంక్షలు పెట్టారా?
ఇదే సందర్భంగా 2010లో తన 'రగడ' సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను బయటకు లాగారు. అప్పటి ముఖ్యమంత్రికి సినిమా టికెట్ ధరలను పెంచాల్సిందిగా ఆయన కోరారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయనీ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలను పట్టించుకోవడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ధరల అంశం తన ఒక్కడికి మాత్రమే సంబంధించిన సమస్య కాదనీ, అందరు హీరోల సినిమాలకు సంబంధించిన సమస్య అనీ, అందువల్ల కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయంలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాననీ ఆయన అన్నారు.
Also read: నాగబాబు దృష్టిలో చిరు చేసిన అలాంటి రిస్కీ ఫైట్‌ను మరే హీరో చేయలేదు!
ఈ వీడియోను షేర్ చేసిన నెటిజన్లు 'రగడ' ఈవెంట్ సినిమా ఈవెంటా? పొలిటికల్ ఈవెంటా? అని ప్రశ్నిస్తున్నారు. 'బంగార్రాజు' ఈవెంట్‌లో "సినిమా స్టేజ్‌పై రాజకీయాలు మాట్లాడకూడదు, నేను మాట్లాడను" అని చెప్పిన నాగ్.. అప్పట్లో 'రగడ' సినిమా స్టేజ్‌పై రాజకీయాలు, సినిమా టికెట్ల ధరల గురించి ఎందుకు మాట్లాడారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ నాగార్జున రెండు నాల్కల ధోరణినీ, ఆయనలోని ద్వంద్వ ప్రమాణాలను చూపుతోందని వారంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



