Home

»

Bollywood News

kangana ranaut: కంగనా రనౌత్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. సంపాదించింది ఇదే

Jul 29, 2026 3:54PM

 


డ్రీమ్ గర్ల్ నుంచి ఫైర్ బ్రాండ్ గా ఛార్జ్ తీసుకొని వరుస సంచలన చిత్రాలతో దూసుకుపోతున్న నటి కంగనా రనౌత్(kangana Ranaut). రాజకీయాల్లోకి ప్రవేశించి  మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రాతినిధ్యం వహిస్తుందంటే నటిగా తన ప్రవాహాన్ని అర్ధం చేసుకోవచ్చు.దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ,విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న 'జెన్ జెడ్' (Gen Z) విద్యార్థి పోరాటాలపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విద్యార్థుల నిరసన వీడియాలని  ప్రస్తావిస్తూ, వాటిని చూస్తే 'వాంతులు వచ్చేలా ఉంది.యువత మాట్లాడుతున్న భాష, ప్రవర్తిస్తున్న తీరు సమాజానికి హానికరం. భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, విద్యార్థులని  'జెనరేషన్ గట్టర్' (Generation Gutter) మరియు 'లార్వాలు' (cockroaches) అంటూ తీవ్రంగా విమర్శించారు. చదువుల్లో సరైన ప్రావీణ్యం లేని వీరు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేనివారని, కనీసం గృహిణులుగా మారే అర్హత కూడా వీరికి లేదని ఎద్దేవా చేశారు. 

ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ(Vishal Dadlani)కంగనా వైఖరిని ఎండగడుతూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేసారు. రోడ్లపై హక్కుల కోసం పోరాడుతున్న యువతపై వీధి రౌడీల్లా దాడి చేశారని, వారిపై రాళ్లు రువ్వి, టియర్ గ్యాస్ ప్రయోగించి, పెల్లెట్ గన్లతో ముఖాలపై కాల్పులు జరిపారు. మీరు సొంతంగా చెల్లించిన గూండాలతో వారిని బెదిరిస్తూ, కొట్టిస్తూ మళ్లీ వారి భాషపైనే మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మీరు చేసిన పనులకే వారి నుంచి ఈ తిట్లు వచ్చాయి. మీరు పెట్టిన ఈ పెయిడ్ ప్రచారాలు, ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్లు మిమ్మల్ని మరింత దిగజార్చేలా చేస్తున్నాయి" అంటూ విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కంగనా గత నెల జూన్ న భారత భాగ్య విధాత తో సెల్యులాయిడ్ పై సందడి చేసింది. 


Also read: నా మాజీ భార్యకి చాలా మందితో ఎఫైర్స్.. ప్రముఖ నటిపై సంచలన వ్యాఖ్యలు 

Kangana Ranaut,  Vishal Dadlani

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com