Home

»

Bollywood News

'రామాయణ' ఆడియో రైట్స్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్.!

Jul 29, 2026 2:22PM

భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ కాన్వాస్‌పై రూపుదిద్దుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ'. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో, ప్రముఖ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కాకముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏకంగా రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో, కేవలం ప్రచారం కోసమే 40 మిలియన్ యుఎస్ డాలర్ల కేటాయింపులతో రూపొందుతున్న ఈ ఎపిక్ ప్రాజెక్ట్, తాజాగా బాలీవుడ్ లో మునుపెన్నడూ చూడని రీతిలో భారీ ఆడియో రైట్స్ డీల్‌ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ స్వరాలు సమకూరుస్తుండటంతో, మ్యూజిక్ మార్కెట్లో ఈ ప్రాజెక్ట్ పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన గ్లోబల్ మ్యూజిక్ రైట్స్ ద్వారా మేకర్స్ ఏకంగా రూ. 100 కోట్ల మేర రాబట్టాలని భావించారు. దీనికోసం టి-సిరీస్, సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ వంటి దిగ్గజ ఆడియో లేబుల్స్ పోటీపడ్డాయి. పలు విడతల చర్చల అనంతరం ప్రముఖ సంస్థ టి-సిరీస్ ఈ ఆడియో హక్కులను దక్కించుకుంది.

రెండు భాగాలకు సంబంధించిన ఆడియో హక్కుల కోసం టి-సిరీస్ ఏకంగా రూ. 75 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ మ్యూజిక్ సేల్‌గా నిలిచి 'రామాయణ' సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. రెహమాన్, హన్స్ జిమ్మర్ ద్వయం అందిస్తున్న డివోషనల్ మ్యూజిక్ కచ్చితంగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుందనే నమ్మకంతోనే టి-సిరీస్ ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిందని టాక్.

రెండు భాగాలుగా రానున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యంలో మొదటి భాగం 2026 దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది. ఈ విజువల్ వండర్ ట్రైలర్‌ను బ్రహ్మ ముహూర్తంలో జూలై 30 గురువారం తెల్లవారుజామున 4:15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. 

 

 

Ramayana, Audio Rights, T Series, Ranbir Kapoor

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com