'ఆదిపురుష్' 20 వేల థియేటర్లలో రిలీజవనుందా?
on Jan 29, 2022

ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఫిల్మ్ 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రను కృతి సనన్ చేస్తోంది. రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పలు భారతీయ భాషలతో పాటు జపనీస్, చైనీస్ లాంటి విదేశీ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Also read: 'సారంగ దరియా' పాటకు మరింత అందం తీసుకొచ్చిన 'లయ'!
హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాని టి-సిరీస్, రెట్రోఫిలిస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దేశంలోని అత్యధిక బడ్జెట్‌తో తయారైన సినిమాల్లో ఒకటిగా రూ. 450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తయారవుతోంది. ఇదివరకు ఈ సినిమాని పాన్ ఇండియా ఫిల్మ్‌గా పిలిచారు కానీ, ఇప్పుడు దీన్ని పాన్-వరల్డ్ మూవీగా అభిమానులు అభివర్ణిస్తున్నారు. అందుకు అనుగుణంగానే 'ఆదిపురుష్'ను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 20 వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు సంకల్పించినట్లు సమాచారం. అదే జరిగితే, ఇన్ని థియేటర్లలో విడుదలయ్యే తొలి భారతీయ సినిమాగా 'ఆదిపురుష్' నిలవనుంది.
Also read: షాహిద్ కపూర్ పేరుతో విసిగిపోయిన విద్యా బాలన్!
రెండు భాగాల 'బాహుబలి' సినిమాతో వచ్చిన మహా క్రేజ్‌తో దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. త్వరలో ఆయన తెలుగు సినిమా 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



