అక్షయ్ కుమార్ 'బడే మియాన్ చోటే మియాన్' లో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్
on Mar 31, 2024
బాలీవుడ్ యాక్టర్స్ అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో మానుషి ఛిల్లార్, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు.
ఏ పాత్రలో అయిన అవలీలగా నటించే సుకుమారన్ నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం విమర్శకుల ప్రశంశలు పొందింది. 'బడే మియాన్ చోటే మియాన్' సినిమాతో పృథ్వీరాజ్ మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు.
ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మధ్య యాక్షన్ చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి ఏప్రిల్ 10న విడుదలవుతోన్న ఈ యాక్షన్ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
Also Read