Facebook Twitter
గురు పూర్ణిమ సందర్భంగా వందనము అభివందనము వేదవ్యాసునకు

 

గురు పూర్ణిమ సందర్భంగా

వందనము అభివందనము  వేదవ్యాసునకు

 


    


వేదమందలి దివ్యజ్ఞానము
విదులకే పరిమితము గాదని
అందరికి ఆచరణ యోగ్య
మ్మిందుగలదదనునట్టి ఋషికి॥ వందనమ్మభివందనం ॥.

ఋక్ యజుస్సామాది ఋక్కుల
నియమమున విభజించి వేదము
లీయగల్గే ప్రజ్ఞగల్గిన
యీ యశశ్వికి వందనమ్ము ॥వందనమ్మభివందనం॥

పరాశరుడా సత్యవతి నా
తీరమునకు  జేర్పమనకుండిన
ధర్మపరాయణు వేదవ్యాసుడు
తరతరాలకు వరముయౌనె ?॥వందనమ్మభివందనం ॥

పురాణములను , ఉపనిషత్తుల
పర హితముగ రచింప కుండిన
పర సంసస్కృతియె నెత్తికెక్కగ
భారత సంస్కృతి నిల్చి యుండెన ?॥వందనమ్మభి వందనం॥

వాష్ణువవతారమ్మితడె యౌ
కృష్ణ ద్వైపాయనుడె వ్యాసుడు
కృష్ణవర్ణమున కృష్ణుడాతడు
ద్వీప భవ ద్వైపాయుం డితడు ॥వందనమ్మభివందనం ॥

ధర్మస్ధాపన కృష్ణు డాతడు
ధర్మమ్మొసగిన కృష్ణుడీతడు
ధర్మాధర్మ విచక్షణమ్మను
మర్మ భారత విరించి యీతడు ॥వందనంమ్మభి వందనం॥

 

 

 

 

 

గీత రచన:— నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్