Facebook Twitter
అలా జరిగింది

 

అలా జరిగింది


యాంకర్: నమస్తే రైటర్ రాంబాబు గారూ..
రాంబాబు: నమస్తే...
యాంకర్: మీరు సూపర్‌గా రాస్తారు సార్..
రాంబాబు: థాంక్యూ...
యాంకర్: ఒక ముఖ్యమైన ప్రశ్న..
రాంబాబు: అడగండి..
యాంకర్: గతంలో మీరు రాసిన అన్ని నవలల్లో ఒక కోతి పాత్ర తప్పనిసరిగా వుండేది. కోతులు ఎలా బిహేవ్ చేస్తాయో చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేసినట్టుగా రాసేవారు. కానీ, మీ లేటెస్ట్ నవల్లో కోతి పాత్ర లేదు... కారణం?
రాంబాబు: ఆ నవల రాయడానికి కొద్దిరోజుల ముందు నేను మా ఆవిడ నుంచి విడాకులు తీసుకున్నాను మరి.