TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ప్రొఫెషనలిజం
బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు బలిష్టమైన బాక్సర్లు ఒకర్నొకరు బలంగా కొడుతున్నారు. ఇద్దరి మధ్య ఫైట్ పోటాపోటీగా వుంది. బాక్సింగ్ రింగ్ చుట్టూ గ్యాలరీలో వున్న ప్రేక్షకులు తాము సపోర్ట్ చేసే బాక్సర్ గెలవాలని ఉత్సాహంగా అరుస్తున్నారు.
మొదటి బాక్సర్ రెండో బాక్సర్ని పళ్ళు రాలేలా మూతిమీద కొట్టాడు. అది చూసి ప్రేక్షకులలో ఉన్న అప్పారావ్ సంతోషంతో చప్పట్లు చరిచాడు.‘‘భలే.. పళ్ళు భలే రాలగొట్టావ్’’ అని అరిచాడు.
ఆ తర్వాత రెండో బాక్సర్ మొదటి బాక్సర్ని పళ్ళు రాలేలా మూతిమీద కొట్టాడు. దాన్ని చూసిన అప్పారావ్ మళ్ళీ సంతోషంతో చప్పట్లు చరిచాడు. ‘‘భలే.. పళ్ళు భలే రాలగొట్టావ్’’ అని అరిచాడు.
ఏ బాక్సర్ పళ్ళు రాలినా చప్పట్లు కొడుతున్న అప్పారావుని అతని పక్కనే వున్న వెంకట్రావ్ అనుమానంగా చూసి ‘‘ఎవరి పళ్ళు రాలినా మీరు ఆనందంతో చప్పట్లు చరుస్తున్నారు. ఇంతకీ మీరు ఆ ఇద్దర్లో ఎవరి ఫ్యాన్?’’ అని ప్రశ్నించాడు.
దానికి అప్పారావు ‘‘నేను ఇద్దర్లో ఎవరి ఫ్యాన్‌నీ కాదు... నేను పక్క వీధిలో వుండే పళ్ళ డాక్టర్ని’’ అని సమాధానమిచ్చాడు.