Facebook Twitter
‘‘ఆర్డర్.. ఆర్డర్’’

 

‘‘ఆర్డర్.. ఆర్డర్’’



‘‘యువరానర్.. బోనులో ఉన్న ఈ ముద్దాయి ఒక వ్యక్తిని చంపాడన్న విషయాన్ని ఎంతో గౌరవనీయులైన మీలాంటి జడ్జిగారికి తెలియజేయాలన్న ఆవేదన నా మనసులో గూడుకట్టుకుని వున్నప్పటికీ ఆ విషయాన్ని మీకు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. ఎందుకంటే ఆ బాధ గుండెలోంచి గొంతులోకి వచ్చేసి అడ్డుపడుతోంది. అయినప్పటికీ నేను గొంతు పెగల్చుకుని మీకు ఈ విషయాన్ని చెప్పక తప్పడం లేదు.. అంచేత యువరానర్ ఈ ముద్దాయిని ఉరి వేసి గానీ, కరెంటు షాక్ పెట్టిగానీ ప్రాణం పోయే వరకూ, శరీరంలో కదలికలు ఆగిపోయే వరకూ చనిపోయే విధంగా మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను’’

‘‘కేసు పూర్వాపరాలను, లాయర్ గారి వాదనను పరిశీలించిన పిమ్మట... మర్డర్ చేసిన ముద్దాయిని విడిచిపెడుతూ, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పకుండా మెలికల మీద మెలికలు తిప్పిన లాయర్‌ గారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇస్తున్నాను’’

‘‘కెవ్’’