Facebook Twitter
లవ్ స్టోరీ

   

   లవ్ స్టోరీ

 


                  

- జి.వి అమరేశ్వరరావు

పార్ట్ - 3

 

    అది ఇంద్రమిత్ర అయుష్హుకు సంభందించిన అంశం.ఆ అంశం కింద ఇంద్రమిత్రకు యమగండం వుందనీ, ఆ గండాన్ని దాటగలిగితే, అతడు మరో అరవై తొమ్మిది సంవత్సారాలవరకూ బ్రతికే అవకాశం వుందనీ.

    దాదాపు నేలరోజులపాటు వుండే యమగండం కాలాన్ని దాటడానికి రోజూ శివుడుకి బీజక్షరాల జపం చేయాలనీ, యమగుండకాల పరిధి 21-11-1998 నుంచి 19-12-1998వరకూ వుంటుంది. అని వ్రాసివుంది. "అంటే తనకు ప్రాణ గండం నిన్నటినుంచే ప్రారంభం అయిందన్నమాట" అనుకున్నాడు ఇంద్రమిత్ర.

    చివరి అంశం చదివిన తర్వాత ఇంద్రమిత్ర పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది. అతడు తన చేతిలోని ఆస్ట్రాలజీ షిట్ ని చించిముక్కలు చేసి డస్ట్ బిన్ లోకి విసిరాడు.

    "ఎక్స్ క్యూజ్ మీ " అన్నా పిలుపుతో ఐరిస్ తల ఎట్టి చూసింది. ఎదురుగా దాదాపు ఇరవై సంవత్సారాల వయసున్న యువతి నిలబడి వుంది.

    "నా పేరు శిశిర. డాక్టర్ గారితో అపాయింట్ మెంట్ వుంది" అంటూ చెప్పిందా అమ్మాయి.

    ఐరిస్ ఆ ఉదయం ఇంద్రమిత్రతో అపాయింట్ మెంట్ వున్నవాళ్ళు లిస్టు వైపు చూసింది.

    ముల్క్ రాజ్....

    శిశిర....

    ఆర్ముగనావలర్....

    ఏకనాథన్....

    సియోరామ్....

    త్రైలోకనాథ్.... కొల్హాట్కర్....

    నంబూద్రి....

    ప్రసన్నలావ్ జైన్....

    అవనింద్రనాథ్....

    ప్రతి పేరుకూ ఎదురుగా వాళ్ళ అపాయింట్ మెంట్ టైము కూడా నోట్ చేసి వుంది. ఐరిస్ ఓసారి చేతి గడియారం వంక చూసుకుంది. అప్పటికే ముల్క్ రాజ్ రావలసిన సమయం దాటి అయిదు నిమిషాలు అయింది. రావలసిన మొదటి పేషెంట్ కరెక్ట్ సమయానికి కనక రాకపోతే ఆ తరువాత రెండో పేషెంట్ కనక రాదేగా వుంటే రెండో వ్యక్తిని లోపలకి పంపించమని ఐరిస్ తో ఇంద్రమిత్ర గతంలోనే చెప్పి వున్నాడు.

    ఐరిస్ అపాయింట్ మెంట్ నడుస్తూ ఇంద్రమిత్ర మూస్తూ శిశిరతో డాక్టర్ గారు లోపలవున్నారు వెళ్ళండి" అంటూ చెప్పింది.

    శిశిర మెల్లిగా నడుస్తూ ఇంద్రమిత్ర రూమ్ వైపు కదిలింది.

    ఆమె కనుమేరుగు అయ్యేవరకూ చూస్తూనే వుంది ఐరిస్. ముందు వైపు శిశిర ఎంత అందంగా వుందో, వెనుక వైపు నుంచి కూడా అంతే అందంగా వుంది. అందమయిన ముఖంతో పాటు చక్కటి పర్సనాలీటి వుండే ఆడవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వుంటారు. అలాంటి వాళ్ళలో శిశిర ఒకటి.

    శరీరం చాయనఛాయా రంగులో ఉన్నా చాలా అందమైన అమ్మాయి శిశిర కన్ సల్తిమ్గ్ రూమ్ లోకి వెళ్ళగానే చూపులు మరల్చుకుని పక్కనే వున్న ఓ వారపత్రిక చేతిలోకి తీసుకుంది ఐరిస్.

    లోపలకి వచ్చిన శిశిర చ్వైపు పరీక్షగా చూస్తూ కూర్చావుమంనట్లు కుర్చీ వైపు చెయ్యి చూపించాడు ఇంద్రమిత్ర.

    ఆమె ఇంద్రమిత్రకు నమస్కారం చేసి కూర్చుంది.

    ఇంద్రమిత్ర తనను పరిచయం చేసుకుంటూ చెప్పాడు_

    "నా పేరు ఇంద్రమిత్ర... ఈ మద్యనే ప్రాక్టీస్ ప్రారంభించాను.

    శిశిర ...

    "అవును.దేయిలే మిర్రర్ పత్రికలో మీ గురించి చదివాను..... మీ ఫోటో కూడా చూశాను" అని ఇంద్రమిత్ర వైపు ఓ సారి చూసింది ఆమె.

    నిజానికి ఇంద్రమిత్ర ఫోటోలో కన్నా చాలా హ్యండ్ సమ్గా వున్నాడు. కాలేజీలో చదివినపుడు అయిదు సంవత్సరాల పాటు మిస్టర్ హైదరాబాద్ టైటిల్ కైవశం చేసుకున్నాడు.

    బలమయిన శరీరంతోపాటు చురుగ్గా చూసే కళ్ళు, కోటేరుముక్కు, విశాలమయిన నుదురు, వత్తయిన మీసకట్టుతో మీసాలు పెంచిన గీకు వీరుడు హీర్క్యులస్ లా కనిపిస్తుంటాడు.

    సైకియాట్రిస్టు ప్రాక్టిస్ మొదలు పెట్టిన ప్రారంభంములో ఇంద్రమిత్ర దగ్గరకి పేషెంట్స్ అట్టే వచ్ఘేవాళ్ళు కాదు. డెయిలీ మిర్రర్ పత్రికలో పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో ఇంద్రమిత్ర ప్రాక్టిస్ పెరిగింది దాదాపు ఆరు నెలల నుంచీ డెయిలీ మిర్రర్ డెయిలీ ప్రశ్నలకు అసమాదానాలు యిస్తున్నాడు ఇంద్రమిత్ర.

    డెయిలీ మిర్రర్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేసే ఘనశ్యాం ఇంద్రమిత్రకు మంచి ప్రెండ్. మొదట్లో ప్రాక్టిస్ బాగాలేకపోవడంతో తాను పనిచేసే పత్రికలో ఏదైనా శీర్షక నిర్వహించమనీ,అందువల్ల ఒకవైపు పత్రికకు అదనపు ఆకర్షణతోపాటు ఇంద్రమిత్ర ప్రాక్టిస్ పెరిగే అవకాశం వుందనీ చాలాసార్లు చెప్పాడు ఘనశ్యాం. చవరకు ఘనశ్యాం మాటను తిసేయలేని ఇంద్రమిత్ర డెయిలీ మిర్రర్ లో 'మీరు మీ మానసిక సమస్యలు' అనే పేరు మీద శీర్షక ప్త్రారంభించటం మొదలు పెట్టాక నాలుగు వారాల్లో అద్భ్తమటిన రెస్పాన్స్ వచ్చింది ఇంద్రమిత్ర బిజీ అయ్యాడు. అల ఇంద్రమిత్ర నడుపుతున్న శీర్షక చదివి అతని ఆడ్రస్ తెలుసుకుని కలుసుకోవడానికి వచ్చింది శిశిర.

    ఇంద్రమిత్ర అడిగాడు.

    "ఏం తీసుకుంటారు? కాఫీ, ఛాయ్, కూల్ డ్రింక్?"

    ఆమె ఇబ్బందిగా కదిలింది.

    "పర్లేదు చెప్పండి."

    "నేను ఇంతకు ముందే ఛాయ్ తాగి వచ్చాను."

    "ఇంకో కప్పు తాగండి. బయట వాన పడేట్టుంది. ఈ వాతావరణలో వేడి వేడి ఛాయ్ తాగితే బావుంటుంది."