Facebook Twitter
చేరాకు అక్షరాంజలి

  చేరాకు అక్షరాంజలి

 

 

 

           చేరా... ఈ రెండు అక్షరాలు తెలుగు సాహితీ వేత్తలందరికీ సుపరిచితం. ఆ అక్షరాలే తెలుగు భాషకు ఆధునిక భాషాశాస్త్ర సూత్రాలను నేర్పింది. విమర్శకు సరికొత్త పద్ధతులను నేర్పి ఎందరో కవులను, కవయిత్రులను ప్రోత్సహించింది. పరిశోధకునిగా, భాషావేత్తగా, విమర్శకుడిగా ప్రఖ్యాతి గాంచిన చేరా గురువారం (24-7-2014) రాత్రి ధ్యానం చేస్తూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఆయన లోటు తెలుగు సాహితీలోకానికి తీరనిది. 1934 అక్టోబరు1 ఖమ్మంజిల్లా ఇల్లెందపాడులో జన్మించిన చేరా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పి.హెచ్ డీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర అధ్యాపకులుగా సేవలందించారు.  వీరు రాసిన తెలుగు వాక్యం, భాషాంతరంగాలు, చేరా పీఠికలు, మరోసారి గిడుగు, చేరాతలు లాంటి ఎన్నో గ్రంథాలు ప్రామాణికాలు. వీరి స్మృతికిణాంకం పుస్తకానికి 2002 లలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరి మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ సంతాపం ప్రకటించారు. తెలుగు కవులు, రచయితలు, విమర్శకులు వారి కుటుంబానికి సానుభుతిని తెలియజేశారు.     
         


డా. ఎ.రవీంద్రబాబు