TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
లవ్ స్టోరీ
- జి.వి అమరేశ్వరరావు
కళ్ళు జిగేల్ మనిపించేలా మెరుపు మెరిసింది.
కర్ణభేరిని అదరకొడుతూ ఆకాశం గర్జించింది.
అప్పటివరకూ తుంపుగా పడుతున్నా వాన ఆకస్మతంగా ఉగ్రరూపం దాల్చింది.వీధుల్లోనూ, షాపుల్లోనూ వెలుగుతున్నా ఎలక్ట్రిక్ లైట్లు ఒక్క సారిగా ఆరిపోవడంతో అంధకారం వ్యాపించింది.
అపుడు సమయం రాత్రి తొమ్మిదిగంటలవుతోంది.
"వాన పడితే చాలు సార్! పవర్ ఫెయిల్ అయిపోతుంది." అన్నాడు ఆటో డ్రయివర్. పాసింజర్ సీట్ లోకూర్చున్న సాధూరం అవునన్నట్టు తల ఊపాడు. మరో అర్దకిలోమీటరు దూరం వెళ్ళిన తర్వాత రోడ్డుకు ఎడం వైపున ఆటో ఆపించాడు సాధూరాం. డ్రయివర్ ఇంజన్ రైజ్ చేసి మీటర్ చూసి ఫేర్ ఎంతయిందో చెప్పాడు. సాధూరాం రెండు పది రూపాయల నోట్లు ఆటో డ్రయివర్ చేతికి ఇచ్చాక ఎదురుగ్గా కనబడుతున్నా బిల్డింగ్ వైపు చూశాడు.
"నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్"
అనే అక్షరాలు రోడ్డుమీద వేడుతున్నవెహికల్స్ హెడ్ లైట్లు వెలుగులో గోల్డ్ కలర్ లో మెరుస్తూ కనిపించాయి.
సాధూరం రోడ్డు క్రాస్ చేయాలనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అరడజను వెహికల్స్ మోకాలలోతున పారుతున్న నీళ్ళను చిమ్మికొడుతూ దూసుకుపోయాయి.
సరిగ్గా అదే సమయంలో వీధి కార్నర్ లో ఆగిన టాటాసియోలోంచి ఇద్దరు వ్యక్తులు క్రిందకి దిగారు. ఇద్దరు మోకాళ్ళ క్రిందవరకూ వుండే రెయిన్ కోట్స్ వేసుకుని నెత్తిన వాటర్ ప్రూప్ క్యాప్స్ పెట్టుకుని వున్నారు. వాళ్ళు వేగంగా సాధూరం వైపు మూవ్ అయ్యారు.
సరిగ్గా అపుడు కదిలాడు సాధూరాం ఈడ్చికొడుతూన్న వానజల్లు ముఖానికి తగలకుండా చెయ్యి అడ్డం పెడుతూ రోడ్డు క్రాస్ చేసి ఆస్ట్రాలజీ సెంటర్ లోకి ప్రవేశించాడు.
రిసెప్షన్ లో ఒక టీనేజీ అమ్మాయికూర్చుని వుంది. కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం అందంగా కనబడుతోంది. ఆమెకు సాధూరాం జేబులోంచి ఓ రీసెట్ తీసి అందించాడు. రిసీట్ మీద వ్రాసి వున్న పేరు ఆమె పెద్దగా చదివింది.
"సాధూరం మడ్కోంకర్"
అవునన్నట్టు సాధూరాం తల వూపాడు.
రిసేప్షస్ట్ డెస్క్ సొరుగులోంచి ఓ వంద వరకూ వున్న కవర్స్ బయటకి తీసింది. వాటిల్లోంచి సాధూరాం పేరు వ్రాసివున్న కవర్ తీసి అతడికి అందించింది.
సాధూరాం అరెంగా కవర్ ఓపెన్ చేసి మడతలు పెట్టిన ప్రింటేడ్ షీట్ ఇకటి బయటకి లాగాడు. సాధూరం జాతక చక్రం. భవష్యుత్ లో అతడి జీవితంలో జరగబోయే మార్పులు వగైరా అందులో ప్రింట్ చేసి వున్నాయి. అతని కళ్ళు అక్షరాల మార్పులు వగైరా పరిగెత్తాయి. ప్రింటెడ్ షీట్ లో అతని పేరు, వయసు, రాశి, నక్షిత్రం, జన్మలగ్నం, అదృష్టసంఖ్య, మక్షిత్ర గానం, నక్షత్రయోని మొదలయినవి అన్నీ వివరంగా వ్రాసి వున్నాయి. వాటితోపాటు అతడికి కలసివచ్చే వారం, అతడు ఎలాంటి రాయి ఏ వేలికి మొదలయిన వివరాలతో పాటు రాశి, అంశ, చక్రాలు కూడా వేసి వున్నాయి.
దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వరకో సాధూరాం హాయిగా గడిపాడు.
సాధూరం తండ్రికి ఐరన్ మర్చంట్ గా మంచి పేరుంది. తండ్రి మరణించిన తర్వాత అతడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. ప్రస్తుతం అప్పట్లో పీకలవరకూ కూరుకుపోయివున్నాడు సాధూరాం. అతడి జీవితములో చోటుచేసుకున్న మార్పులు అన్నీ కంప్యూటర్ జాతకంలో చాలా వరకూ సరిపోయాయి. నేలరోజుల్లో మీ వల్ల మీ కుటుంభానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.అనే అంశం సాధూరాంకు ఆశ్చర్యపరిచింది.ఆ ఐటం చదివిన వెంటనే సాధూరం పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షం అయింది.
"ఏమో! జాతకంలో వ్రాసినట్లు తాను త్వరలోనే లక్షాధికారి అవుతాడేమో?" అనుకుంటూ చిట్టచివరి ఐటం చదివిన సాధూరాం భ్రుకటి ముడిపడింది.
అది సాధూరాం అయుష్యుకు సంభందించిన విషయం. అందులో సాధూరం ఆకస్మికంగా బలవన్మరణానికి గురి అవుతాడనీ, హత్య చేయబడవచ్చనీ వ్రాసివుంది.
యమగుండాన్ని తప్పించుకునేందుకు శివుడికి 47 రోజులపాటు బీజాక్షరాలతో జపం చీయాలని ఓ సజెషన్ కూడా ప్రింట్ చేయబడివుంది.
సాధూరాంకు చివరి ఐటం మీద నమ్మకం కలగలేదు అతడు ఆలోచించాడు. తనకు తెలిసీ ఎవరికీ అపకారం చేయల్డు. వ్యాపారంలోకూడా తనకు శత్రువులు ఎవరూ లేరు. అలాంటప్పుడు తనను ఎవరు హత్యచేస్తారు? ఇదంతా ట్రాష్ అనుకుంటూ కవర్ని జేబులో వుంచుకున్నాడు.