TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నాలో నేను
- గీత
జోరున వర్షం....ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చే ఆ హోరు ఎందుకో ఇప్పుడు కలవర పెడుతుంది....ఇనాళ్లు ఏదో కోల్పోయాను అని బాధపడే నాకు వాళ్ల ఆస్థీత్వాన్నే కొల్పోతున్న ఈ తరం పిల్లల్ని చూసి...నువ్వేం కోల్పోయ్యావు అని మనసు ఎదురు ప్రశ్న వేస్తుంది...సమాధానం దొరికితే కదా...దానికి నచ్చచెప్పటానికి.....ఇంతగా నా మనసు నన్ను నన్ను గా నిలవనివ్వక పోవటానికి కారణం....జీవితం లో ఎవ్వరు అందుకోనంత ఎత్తుకు ఎదగాలని.....ఎదో సాధించాలని.....ఇంకా తేలిగ్గ చెప్పాలంటే నాకు నేను నచ్చాలని కోరుకోవటమే...పరిస్ధితులు ఏవైతేనేం.....చిన్నతనం పెళ్లి...పిల్లలు...బంధాలు...బంధుత్వాలు...భాద్యతలు....సర్దుబాట్లు....పైకి అన్ని బావునట్టే వున్న ఏదో తెలియని వెలతి మనసు పొరల్లో.....అందుకే నాక్కావాల్సీన ప్రపంచం కోసం వెతకటం ప్రారంభించాను..ఉద్యోగ పర్వం అంటూ బయలుదేరాను...బయట రంగుల ప్రపంచం ఇంత బావుటుందా అనిపించింది..సీతకోక చిలుకల్లా ఎగిసి పడుతున్న ఈ తరం అమ్మాయిల్ని చూసి మహ ముచ్చటేసింది....చదువు...కమిట్ మెంట్..సాధించాలి అనే తపన తో పాటు స్త్రీ సహజత్వం.. చిన్నపాటి చిలిపితనం..కాస్తంత గడుసుతనం...కలసిన నేటి మహిళలు అనిపించే మఘువలు...అబ్బురపరిచారు...కాని ఈ కధ నాణాణి కి ఓ వైపే...మరో వైపు ఆడతనం అనే చేపను మగవాడి బలహీనతకు ఎర వేసి...ఎదగటం...ఇల ఒకరితో కాదు పనికివచ్చే ప్రతివాడితో....వాళ్లను వాళ్లు కోల్పోతూ.....వాళ్ల ఆస్థిత్వన్ని తాకట్టు పెడుతూ....అందరాడపిల్లలు ఇలానే వున్నారు అని కాదు కాని చాలా మటుకు ఉన్నతంగా ఎదగాలి అంటే ఇదే సులువైన మార్గం అనుకుంటున్నారు...అందుకే ఆ దారి వెంట గుడ్డిగా ప్రయాణిస్తున్నారు....పూల దారి అనుకుంటూ రక్తసిద్దమైన పదాలు పట్టించుకోకొండ భావిత అంటూ భ్రమపడుతున్నారు....మారుతున్న కాలం లో ఇది తప్పు కాక పోవచ్చు..మనసు అంగీకరించనూవచ్చు....కాని ఈ మార్పుకి కారణం...సంపాదనే పరమావధి అని నేర్పుతున్న తల్లదండ్రులదా....మార్కలే మనిషి తెలివి కి కొలమానాలు అని నేర్పుతున్న విద్యావ్యవస్ధదా....సంస్కారం నేర్పలేకపోతున్న సమాజానిదా...ఎవరు భాద్యత వహించిన....మనని మనం కొల్పోతున్నాం అనేది మాత్రం వాస్తవం....ఎవరి జీవితం వారి ఇష్టం అని ముసుగు వేస్తున్నాం...ఎలా అని కాదమ్మ ఎదిగామా లేదా అనేది పాయింట్ అంటూ అంకెలు అందుకోవటం లో మనని మనం వెత్తుకుంటున్నాం...నా ఆలోచన ల వేడి పెరుగుతుంటే వాన జోరు కొద్ది కొద్ది గా తగ్గుతుంది...చల్లని గాలి మెల్లగా చెక్కిలిని మీటుంది....అర్దంలేని ఈ అలోచనలు కు జవాబు దొరకాలి అంటే ఇంకోంచం ఎదిగి ఆలోచించు అంటుంది......నిజమే నా పరం గానే ఎందుకు ఆలోచిస్తున్నా...నాకు అస్ధిత్వం ..వ్యక్తిత్వం అనిపించేవి వారికి తుఛ్చమైనవి కావచ్చుగా వాళ్ల పరం గా వాళ్లకు నచ్చినట్టుగా వారి జీవితాన్ని మలుచుకోవటమే పరిపూర్ణమైన సంతోషాన్ని వారికి ఇవచ్చుగా...మనుకు తెలిసిందే మనుకు అనుకూలంగా వున్నదే మంచి అనుకుంటే ఎలా...మనిషి మారుతున్నాడు...విలువలు మారుతున్నాయి....మారుతున్న కాలం తో నువ్వు మారకపోయినా....మార్పును అంగీకరించటం లో తప్పులేదు కదా...వర్షం పూర్తిగా తగ్గింది..మనసు తేలిక పడింది....