Facebook Twitter
ఇంకెన్నాళ్ళు

ఇంకెన్నాళ్ళు

- ఇల్లిందల పద్మా శ్రీనివాస్

ఇది ఒక నిర్భయ కథ కాదు. ప్రతి  ఆబాల కథ  అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద ఒంటరిగా నడిచినపుడు మనకు స్వతంత్ర్యం వస్తుంది అని  గాంధీ గారు అన్నారు. కాని ఇప్పుడు ఆడది అర్ధరాత్రి కాదు పగలే రోడ్డు మీద నడవ లేని పరిస్థితి.అదీ ఒంటరిగా కాదు అన్నాతమ్ముడు, నాన్న, భర్త వల్ల మధ్య కుడా ఆడపిల్ల కి సెక్యురిటీ లేదు. ఎందుకంటే ఉద్యోగం చేసే ఆడదానికి ఆఫీసు లో ఒత్తిడి స్కూల్ కి వెళ్ళే చిన్న పాప కూడా ఇంటికి ఎలా వస్తుందో అని భయపడే రోజులు వచ్చాయి.
ఒక గృహిణికి ఇంట్లో అత్తగారి వల్ల గండం ఏం ఆ అత్తగారు కుడా ఒక నాటి కోడలు అని ఎందుకు గుర్తు రాదు, ముందుగ తను కూడా ఒక ఆడది అని ఎందుకు తెలుసుకోదు. ఏం అత్తా పాత్ర వస్తే కోడల్ని హించించాలా. ఎన్నాళ్ళు ఆడదాని మీద ఈ అఘాయిత్యాలు...

ప్రతి రోజు ప్రతి నిముషం ఆడది భయపడుతూ బతకాలా, ఎందుకు మగవాడితో సమానంగా ఆడపిల్ల ఉండలేకపోతుంది. వాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తుంది. ఈ ప్రపంచంలో ఆడదాని పాత్ర చాలా ఉంది. తల్లిగా, భార్యగా, అక్కగా చెల్లిగా ఆమె పాత్ర చాలా ఉంది.కాని మగవాడి దృష్టిలో  ఆడది ఒక అట వస్తువు కాకూడదు. మనం  రోజు చూస్తున్నాం, రోజు పేపర్లో చదువుతున్నాం. ఎన్నో ఘోరాలు ఆడపిల్ల మీద జరుగుతున్నాయి. ఇంట్లో మనవాళ్ళు అనుకునే వల్ల వల్ల కూడా ఆడపిల్లకి ప్రాణ భయం.. కాదు కాదు  మాన భయం. ఆడపిల్ల ప్రేమించక పోతే చంపేస్తారా ఏం ఆ ఆడపిల్లని హించించే ముందు వాళ్ళకు వాళ్ళ తల్లి భార్య చెల్లి గుర్తుకు రారా.మగవాళ్ళు మృగళ్ళలా నగరం అనే  అడవిలో తిరుగుతుంటే  ఆడపిల్లకి స్వేచ్చ ఎక్కడ వుంటుంది. అలంటి మృగళ్ళకు సమాధులు కట్టాలి వాళ్ళు మన మీద ఆకలి చూపులు విసిరే లోపే మనమే పులి పంజా విప్పి బుద్ది చెప్పాలి. హైటెక్ రోజుల్లో కూడా ఆడది హైటెక్ సిటీలో  మోసపోయింది. ప్రతి ఆడపిల్ల మీద ఇలా  అత్యాచారాలు జరుగుతుంటే ఎన్నాళ్ళు సహిస్తాం.

ఇంకా ఆ రోజులి రాకూడదు ఆడది మరో నిర్భయ కాకుకడదు ఆడది అంటే ఆదిశక్తి అని నిరుపిద్దాం.
ఈ క్షణం నుంచి మన స్వేచ్చా జీవితానికి తెరతిద్దాం