Facebook Twitter
మర్యాద తెలిసిన పిల్ల

మర్యాద తెలిసిన పిల్ల

అదో చిన్న ఊరు. అప్పుడే ఆగిన రైల్లోంచి ఓ అందమైన అమ్మాయి లగేజితో దిగింది. అప్పటికి టైము రాత్రి పదకొండు గంటలు దాటింది.

ఆమె అక్కడే పడుకొని నిద్రపోతున్న ఓ రైల్వే పోర్టర్ ను నిద్రలేపింది.

“ ఈ ఊళ్ళో ఏదైనా మంచి హోటలుందా ?” అడిగిందామె పోర్టర్ ను.

“ లేదండి " అన్నాడు నిద్రమత్తులో ఉన్న పోర్టర్.

“ పోనీ ఏదైనా రెస్టారెంట్ ఉందా !” అడిగిందామె.

“ లేదండి " నిద్రలోనే జోగుతూ జవాబిచ్చాడా పోర్టర్.

“ అరె ! నేనీ రాత్రి ఎక్కడ గడపాలి అయితే " ఆందోళనగా అందామె.

“ మీకు అభ్యంతరం లేకపోతే మా స్టేషన్ మాస్టర్ తో కలిసి రూమ్ లో పడుకోండి.

ఏర్పాటు చేస్తాను " అన్నాడు ఆ పోర్టర్ హుషారుగా మత్తు వదల్చుకుని.

“ ఏమిటి నీ ఉద్దేశం ! నేను మర్యాదస్థుల యింటి ఆడపిల్లను తెలుసా ?” అందామె కోపంగా.

“ మా స్టేషన్ మాస్టర్ కూడా మర్యాదస్థుల యింటి ఆడపిల్లెనండి " అన్నాడు పోర్టర్ తాపీగా.