Facebook Twitter
ఇప్పుడు అర్ధం అవుతోంది

1) పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఎందుకు ఉండేవో...

2) చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ఎందుకు రావాలో...

3) ఇంటా బయట ప్రతీ గడపకీ పసుపు ఎందుకు రాసేవారో....

4) వారానికి ఒకసారి ఇంట్లో సామానులన్నీ సర్ది ఇల్లంతా ఎందుకు కడిగేవారో....

5) సుద్దతో ఇల్లంతా ముగ్గులు ఎందుకు వేసేవారో...
(Calcium నుండి విలువడే ధాతువులు ఇల్లంతా వ్యాపించి కొన్ని వ్యాధికారక వైరస్ లను నిరోదిస్తాయి)

6) సుచిగా స్నానం చేసాకే వంట ఎందుకు చేసేవారో....

7) నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దని,  గోళ్లు కొరకొద్దని, ఏదయినా తినేముందు చేతులు కడుక్కోవాలని ఎందుకు చెప్పేవారో....

8) స్నానం చేసాక మడి అని చెప్పి... స్నానం చేయ్యని మిగతా వారిని అంటకుండా ఎందుకు తిరిగేవారో....

9) మనం బయటకు వెళ్లేముందు ఎవరైనా తుమ్మితే ఆపశకునం అని... కొద్ది క్షణాలు ఆగి వెళ్ళమని ఎందుకు చెప్పేవారో...
(ఆ తుమ్మిన వ్యక్తి నోటినుండి ముక్కు నుండి వెలువడిన తుంపరలు కొద్దిసేపు గాలిలో తేలియాడి మెల్లగా నేలమీదకు చేరుకుంటాయి.... ఆ తుంపరల బారినపడి అంటువ్యాధులు రాకుండా వుండాలని ఆలా చెప్పేవారు)

10) బయటకు వెళ్ళాక తెలిసినవాళ్ళు ఎదురు పడితే (కారాచలనం చేయ్యకుండా) రెండు చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేసేవారో.... 

11) ప్రతీ కూరలోనూ పసుపు ఎందుకు వేసేవారో.

12) నెలకి ఒక్కసారి ఐనా మిరియాల చారు, మెంతుల పులుసు తప్పనిసరిగా ఎందుకు చేసేవరో....

13) కనీసం ఆరు నెలలకి ఒక్కసారి అయినా ఆముదం లేదా చేదు (వేప మూడికలతో) ఎందుకు పట్టించేవారో....

14) ఎవరి ఇంట్లో అయినా బిడ్డ పుట్టినా లేక ఎవరైనా చనిపోయినా 11 రోజులు మైల అని ఎందుకు అనేవరో...

15) ఉదయం లెవగానీ వేప మొదలైన ఔషధ గుణాలు కలిగిన పుడకలతో పళ్ళు తోముకునేవారు.  దీని వలనదంతాలకే కాకుండా కాలేయానికి, ఊపిరితిత్తులకు మంచి చేసేవి.

16) ఉదయం తప్పకుండా చద్దన్నం తినేవారు.  దీని వలన ఆరోగ్యం సమస్యలు వచ్చేవి కావు.

ఇంకా ఇటువంటివి చాలా వున్నాయి...

ఇవన్నీ ఆలోచిస్తుంటే మన పూర్వికులు కూడా కరోనాలాంటి మహమ్మారితో పోరాడి ఇటువంటి నియమాలను ఆచారాలతో మేళవించి అనుసరించారేమో అనిపిస్తుంది 

గానీ మనకి ఆధునిక విజ్ఞానం ఎక్కువయ్యి.... కాకరకాయని.... కీకరకాయ అనడం మొదలుపెట్టాము.
పెద్దవాళ్ళకి చాదస్తం ఎక్కువ అని వారిని చాందశవాదులుగా ముద్రవేసి వారు చెప్పిన మాటలను గేలిచేసి... గాలికి వదిలేసి ఇంతకాలం ఇష్టనుసారం తిరిగి.... ఇదిగో ఇప్పుడు మనకి తెలియకుండానే అవన్నీ కాకపోయినా అందులో కొన్ని ఆచారిస్తున్నాము.

పెద్దలు చెప్పిన మాటలు చద్దన్నం మూట అనే నానుడి నిజంగా అద్భుతం కదా.