TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అంతరంగ ఆలోచన..!!
అంతరంగ ఆలోచన..!!
తురంగ విహంగంతో లోక వీక్షణ..!!
ఎన్నో సందేహాలు,ఆరాటాలు,పోరాటాలు..!!
చిక్కు ముడుల నడుమ అజ్ఞాత శక్తి..!
అదే ఈ సృష్టికి మూలమట..!!
పంచభూతాల సృష్టి కర్తట..!!
నీటిలో మునగదట..!!
గాలిలో తేలదట..!!
నిప్పుల్లో కాలదట..!!
నింగిలో కనిపించదట..!!
నేలపై నడవదట..!!
అది ఓ అందని శక్తిట..!!
అది ఉందో లేదో నాకెందుకట..!!
ఉన్నచో నాకు కనిపించిన..!!
నిలదీస్తా..ప్రశ్నలతో దాడి చేస్తా..!!
ఆడ బిడ్డల మానభంగాల గురించి..!!
కన్నీటితో కడుపు నింపుకునే బీద వారి గురించి..!!
కరువుల..వరదల..గురించి..!!
కుల మత భేదాలు గురించి..!!
అదిగేదా..కదిగేదా..ఎన్నో..మరెన్నో కష్టాల గురించి..!!
అదృష్ట శక్తి ఉన్నా..లేకపోయినా..నాకెందుకులే..!!
ఒక్కటైతే నే యెరుగును..లే..మరణం తధ్యమని..!!
జీవికి మృత్యువు తప్పదని..!!
తోటి జీవులకు వేదన తప్పదని..!!
కడకు మనకొక సమాధి..!!
అదే మన కొత్త జివితానికి పునాది..!!
- జాని.తక్కెడశిల