Facebook Twitter
సొంతంగా పేర్చుకున్న బతుకమ్మ పాట

సొంతంగా పేర్చుకున్న బతుకమ్మ పాట
 


బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా  
మా ఇంటికి రావమ్మ మురియెంగా (మురిపెంగా )
ఊరూ వాడా నిన్ను కొలువంగా 
వీధుల్లో ఆంటీలు (పడుచులు ) నీ చుట్టూరా చేరంగా 

బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా 
బతుకుమ్మ బతుకమ్మ బతుకమ్మా !!

ఎన్నో రంగూల పూలు తెచ్చాను నీ కోసం 
గౌరమ్మ రావమ్మ .. మా ముందుకు ఊ.ఊ 
పూలన్ని పేర్చాను అందాముతో 
ముత్తైదువులంతా చేరి చక్కాగ 
పూలు పేర్చి నాము నీ పూజ జేసేము 
చక్కంగ చూడమ్మ ఓ తల్లీ గౌరమ్మ 

అరచేతి గోరింట , నిండూగ గాజులు 
పసుపూ , కుంకూమ తో నీకు పూజలే 
చేసేము బతుకమ్మ ..మా ఊరూ , వాడ రావమ్మా 
చక్కానీ వరమూలు ఇవ్వమ్మా !!

పిల్లా పాపలను రక్షించు వమ్మా 
బుద్ధీ జ్ఞానములను ప్రసాదించు ఓ బతుకమ్మ 
కష్టాలు , బాధలు తీసేసి ఎప్పుడూ చల్లంగ
చూడమ్మ మా బతుకమ్మ 

పండ్లూ , నైవేద్యాలు పెట్టేము బతుకమ్మా 
మంగళ హారతులు పాడేమూ గౌరమ్మా , 
నదులలో గౌరవముగా నిన్ను సాగనంపేము 
మళ్ళీ వచ్చే ఏడాది దాక చక్కనీ బతుకునూ 

వరముగ ఈయవమ్మ మా బతుకమ్మా 
చల్లగా పోయీ రావమ్మా 
నీ చల్లాని చూపులు మా యందు 
ఉంచమ్మ మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా 🙏🙏


- దివ్య చేవూరి